భారతదేశం, ఏప్రిల్ 28 -- Bajaj pulsar 400 on road price Hyderabad : బైక్​ లవర్స్​కి క్రేజీ న్యూస్​..! ఫ్లాగ్షిప్ బజాజ్ పల్సర్ 400 లాంచ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. మే 3, 2024న ఈ బైక్​ని లాంచ్​ చేయనుంది దిగ్గజ 2 వీలర్​ తయారీ సంస్థ బజాజ్​ ఆటో. కాగా.. లాంచ్​కు ముందే.. ఈ కొత్త బైక్​కి సంబంధించిన కొన్ని వివరాలు ఆన్​లైన్​లో లీకయ్యాయి. అఫార్డిబుల్​ ధరలో మంచి మంచి ఫీచర్స్​తో ఈ పల్స్​ 400 బైక్​ రెడీ అవుతోందని టాక్​ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బైక్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూద్దాము..

ఆన్​లైన్​లో లీక్​ అయిన డేటా ప్రకారం.. బజాజ్​ పల్సర్​ 400 బైక్​లో రీడిజైన్డ్​ ఫ్రంట్ ఫేస్- ట్యాంక్ ఉంటాయి. ముఖ్యంగా, పల్సర్ 400 లో ప్రొజెక్టర్ హెడ్​ల్యాంప్ సెటప్ ఉంటుంది. ప్రతి వైపు ట్విన్ డీఆర్ఎల్స్​ ఉంటాయి. ఆన్​లైన్​లో లీక్​ అయిన బైక్​ ఫొటోలను V12Allies.in అనే ఇన్...