భారతదేశం, ఏప్రిల్ 12 -- బెంగళూరు ఒక్కటే కాదు హైదరాబాద్​తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ట్రాఫిక్​ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆ ట్రాఫిక్​లో డ్రైవింగ్​ అంటే చాలా మందికి చిరాకుగా ఉంటోంది. ఇలాంటిప్పుడే ఆటోమెటిక్​ గేర్​ కార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మాటిమాటికి గేర్లు మార్చే అవసరమే లేకుండా, పెద్దగా కష్టపడకుండా డ్రైవింగ్​ చేసేయొచ్చు. మరి మీరు కొత్త ఆటోమెటిక్​ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ. 15లక్షల ధరలోపు అందుబాటులో ఉన్న బెస్ట్​ ఆటోమెటిక్​ కార్ల వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..

మహీంద్రా థార్​- బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన మహీంద్రా థార్​ ధర రూ. 11.50లక్షల నుంచి రూ. 17.60 లక్షల వరకు ఉంటుంది. అయితే, థార్​ ఎల్​ఎక్స్​ హార్డ్​ టాప్​ ఏటీ ఆర్​డబ్ల్యూ వేరియంట్​ ఆటోమెటిక్​ ఆప్షన్​లో బెస్ట్​! దీని ధర రూ .14.2...