భారతదేశం, ఫిబ్రవరి 13 -- ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​తో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు ప్రమాదంలో పడిన తరుణంలో ఏఐ స్టార్టప్​ "హైపర్​రైట్​" సీఈఓ మ్యాట్​ షూమర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఏఐ అనేది కేవలం ఊహల్లో ఉండే సాంకేతికత కాదని, అది పరిగణనలోకి తీసుకోవాల్సిన ఒక మహా శక్తిగా మారిందని అన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన రాసిన 'సమ్‌థింగ్ బిగ్ ఈజ్ హ్యాపెనింగ్' (ఏదో పెద్ద మార్పు జరుగుతోంది) అనే వ్యాసంలో.. కంప్యూటర్ స్క్రీన్ ద్వారా సాగే వైట్ కాలర్ ఉద్యోగాలు ఆటోమేషన్ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉందని తీవ్రంగా హెచ్చరించారు.

డిజిటల్ రూపంలో ఉండి, ఒక క్రమపద్ధతిలో పదే పదే చేసే పనులను పూర్తి చేసే సామర్థ్యాన్ని ఏఐ వ్యవస్థలు వేగంగా పెంపొందించుకుంటున్నాయని షూమర్ వివరించారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి మార్కెట్లను కుదిపేయడానికి ముందున్న పరిస్థితులతో ఇప్ప...