భారతదేశం, మార్చి 24 -- సువార్త యాత్రలో భాగంగా ఐదు రోజుల పాటు ఎనిమిది క్షేత్రాల‌ను, మెరీనా బీచ్ వంటి మూడు ప్ర‌దేశాల సంద‌ర్శ‌న ఉంటుంది. సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులో ఫుష్‌బ్యాక్ 2+2 సీట్లు, టీవీ సౌక‌ర్యం ఉంటుంది. ఒక్కొక్క టిక్కెట్టు ధ‌ర రూ.6,500 ఉంటుంది. నాలుగు కంటే ఎక్కువ టిక్కెట్లు తీసుకుంటామ‌ని చెబితే.. వారి ఇంటికి వెళ్లి టిక్కెట్లు ఇస్తారు. ఈ ప్యాకేజీలో మ‌ధ్యాహ్నం భోజ‌నం, రాత్రి భోజనం పెడ‌తారు. ఉద‌యం టిఫిన్ పెట్ట‌రు. అలాగే ఎక్క‌డైనా నైట్ హాల్ట్ చేసేట‌ప్పుడు రూమ్స్ తీసుకుంటే.. దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

బ‌స్సు రాజ‌మండ్రి డిపో నుంచి మే 5న మధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. నిర్మ‌ల గిరిలోని గౌరీప‌ట్నం, చెన్నైలో సెయింట్ థామ‌స్ మౌంట్‌, అపోస్తుథామ‌స్ నివసించిన క్షేత్రం, పోప్ జాన్‌పాల్ ద‌ర్శించిన క్షేత్రం, లిటిల్ మౌంట్ పైన్ (మోకాళ్ల...