ఆంధ్రప్రదేశ్,అమరావతి, ఏప్రిల్ 5 -- ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. శుక్రవారం రాత్రి ఏపీపీఎస్సీ ఈ ఫలితాలను ప్రకటించింది. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. మొత్తం 2,168 అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థి సాధించిన మార్కులు కాకాండా. కేవలం హాల్ టికెట్ నెంబర్లను మాత్రమే వెబ్ సైట్ లో ఉంచారు.

899 ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు.మొత్తం 79,451 మంది పరీక్ష రాయగా.. 2,168 అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఎంపికైన వారందరికీ ధృవపత్రాల పరిశీలన తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియజేయనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది.

గ్రూప్-2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో హైకోర్టు తుది తీర్పునకు లోబడి తుది నియామ...