భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 23న ఆదివారం గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది.

పరీక్షలు రాసే అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్ల అంశాన్ని సవాల్ చేస్తూ.. పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పిటిషన్లను కొట్టేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి గ్రూప్-2 ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. దీంతో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకు లైన...