భారతదేశం, ఫిబ్రవరి 23 -- APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1 ప్రాథమిక కీని విడుదల చేసింది. ప్రశ్నలు, ప్రాథమిక 'కీ' పై అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు అవకాశం కల్పిస్తామని ప్రకటించింది.

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు ఎంపిక కాగా వీరిలో 86,459 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో 92శాతం మంది మెయిన్స్ పరీక్షకు హాజరయ్యారని ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. గ్రూప్‌-2 మెయిన్స్ వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా పరీక్ష నిర్వహణకే ఏపీపీఎస్సీ మొగ్గుచూపింది. ఆదివారం యథావిధిగా పరీక్ష నిర్వ...