భారతదేశం, మార్చి 12 -- APPSC Departmental: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, సిబ్బందికి నిర్వ‌హించే డిపార్ట్‌మెంటల్ టెస్టుల నిర్వ‌హ‌ణ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్‌సీ) సన్న‌ద్ధం అయింది. మేర‌కు డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వ‌హించేందుకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వ‌ర‌కు దర‌ఖాస్తు దాఖ‌లు చేసుకునేందుకు గ‌డువు విధించింది. డిపార్ట్‌మెంటల్ టెస్టులు నిర్వ‌హించే తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు.

ఏపీపీఎస్సీ ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in లో దాఖ‌లు చేయాలి. ఫీజు చెల్లించ‌డానికి గ‌డువు ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 11ః59 వ‌ర‌కు ఇచ్చిన‌ట్లు ఏపీపీఎస్‌సీ సెక్ర‌ట‌రీ ఐ.ఎన్ మూర్తి తెలిపారు.

1. ద‌ర‌ఖాస్తుదారులు ప్రాథ‌మికంగా వ‌న్ టైమ...