భారతదేశం, ఏప్రిల్ 8 -- తెలుగు అంథాల‌జీ మూవీ మూడో క‌న్ను థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్‌తో ఈ మూవీ ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

మూడో క‌న్ను మూవీలో సాయికుమార్‌, శ‌శిధ‌ర్, మాధ‌వీల‌త‌, నిరోషా, దేవీప్ర‌సాద్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ అంథాల‌జీ మూవీకి మావిటి సాయిసురేంద్ర‌బాబు, డాక్ట‌ర్ కృష్ణ‌మోహ‌న్, బ్ర‌హ్మ‌య్య ఆచార్య‌, రాంబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

నాలుగు క‌థ‌ల‌తో హైప‌ర్ లింక్‌ అనే స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో మూడో క‌న్ను మూవీ తెర‌కెక్కింది. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన ఈ మూవీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకున్న‌ది. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఆశించిన విజ‌యాన్ని ద‌క్కించుకోలే...