భారతదేశం, మార్చి 22 -- Anthology OTT: మ‌ల‌యాళంలో డిఫ‌రెంట్ కాన్పెప్ట్‌ల‌తో సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాలు అందుకుంటున్నాడు బాసిల్ జోసెఫ్‌. సూక్ష్మ‌ద‌ర్శిని, పొన్‌మాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ త‌ర్వాత ఓ ఆంథాలజీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

మ‌ధురం జీవామృత‌బిందు టైటిల్‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కామెడీ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ ఆంథాలజీ మూవీ టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఈ టీజ‌ర్‌కు రెండు రోజుల్లో వ‌న్ మిలియ‌న్‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. కోరిక, ఇష్టం, సంతోషం లాంటి భావాల‌ను ఈ ఆంథాల‌జీ మూవీలో చ‌ర్చించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

టీజ‌ర్‌లో సినిమాల‌పై ఇష్టం ఉన్న ల‌వ‌ర్‌బాయ్ పాత్ర‌లో బాసిల్ జోసెఫ్ క‌నిపించాడు. టీజ‌ర్ బీజీఎమ్ మెలోడీయ‌స్‌గా సా...