భారతదేశం, జనవరి 30 -- Andhra Loyola Dispute: విజయవాడలో లయోలా గ్రౌండ్స్‌లో వాకింగ్ వివాదం ముదురుతోంది. నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా లయోలా కాలేజీలో వాకింగ్‌ చేయడానికి అనుమతి కోసం వాకర్‌ సంఘాలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నాయి. సున్నితమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం నెలల తరబడి ఉదాసీనంగా వ్యవహరించడంతో ఇది కాస్త రాజకీయ రగడగా మారింది. నగరం మధ్యలో ఉన్న ఈ కాలేజీ దాదాపు 100ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.

1950వ దశకంలో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించే సమయంలో లయోలా కాలేజీకి అంకురార్పణ జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటైన ఈ విద్య సంస్థ ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యుత్తమ కళాశాలల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. క్యాథలిక్‌ మైనార్టీ విద్యా సంస్థగా.. జెస్యూట్ మిషనరీల ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్న లయోలా అనుబంధ సంస్థల్లో ఆంధ్రా లయోలా కాలేజ...