భారతదేశం, ఏప్రిల్ 13 -- Anakapalli Blast : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణా సంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కోటవురట్ల మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. 2026 వరకు బాణసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్ ఉందని, ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుస్తామన్నారు.
"నా నియోజకవర్గం పాయకరావుపేటలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు సహాయక చర్యలను స్వయంగా సమీక్షిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.