భారతదేశం, ఏప్రిల్ 13 -- Anakapalli Blast : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణా సంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కోటవురట్ల మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. 2026 వరకు బాణసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్‌ ఉందని, ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుస్తామన్నారు.

"నా నియోజకవర్గం పాయకరావుపేటలోని కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు సహాయక చర్యలను స్వయంగా సమీక్షిం...