భారతదేశం, మార్చి 17 -- అన‌కాపల్లిలో ఘోర ప్ర‌మాదం త‌ప్పింది. విజ‌య‌రామ‌రాజు పేట అండ‌ర్ బ్రిడ్జి వ‌ద్ద సేఫ్టీ గ‌డ్డ‌ర్‌ను.. ఆదివారం రాత్రి క్వారీ రాళ్ల‌ను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్ర‌మంలో సెఫ్టీ గ‌డ్డ‌ర్ కొద్దిమేర దెబ్బ‌తిన‌డంతో బ్రిడ్జి కుంగింది. రైల్వే ట్రాకులు ప‌క్క‌కి జ‌రిగాయి. అదే స‌మ‌యంలో ఆ మార్గంలో గూడ్స్ రైలు వ‌చ్చింది. ట్రాక్ ప‌క్క‌కి జ‌రిగిన విష‌యాన్ని గుర్తించిన గూడ్స్ రైలు లోకోపైల‌ట్.. వెంట‌నే రైలును నిలిపివేశారు. రైల్వే అధికారుల‌కు స‌మాచారం అందించారు.

రైల్వే అధికారులు, సిబ్బంది అక్క‌డికి చేరుకున్నారు. విశాఖ‌ప‌ట్నం- విజ‌య‌వాడ మార్గంలో ప‌లు రైళ్ల‌ రాక‌పోక‌లను నిలిపివేశారు. విజ‌య‌వాడ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్లే ఎనిమిది రైళ్ల‌ను నిలిపివేశారు. క‌శింకోట వ‌ద్ద గోదావ‌రి ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ల‌ను నిలిపివేశారు. ఎల‌మ...