భారతదేశం, నవంబర్ 28 -- రాజధానిని నిర్ణయించాల్సింది.. రాష్ట్ర ప్రభుత్వమేనని సుప్రీం కోర్టు(Supreme Court) వ్యాఖ్యలతో స్పష్టమైందని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) అన్నారు. రాజధానుల విషయంలో హైకోర్టు(High Court) జోక్యం సరికాదని సుప్రీం కోర్టు మాటలను బట్టి తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని, రాజధానుల విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం వ్యాఖ్యలతో తెలుస్తుందని అంబటి అభిప్రాయపడ్డారు.

'రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని స్పష్టమవుతోంది. న్యాయ స్థానాల పని న్యాయస్థానాలు చేయాలి. ప్రభుత్వం(Govt) పనులను ప్రభుత్వం చేయాలి. చంద్రబాబు(Chandrababu) అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను ఇకపై మానుకుంటే మంచిది. అమరావతి రాజధాని(Capital Amaravati) అనేద...