భారతదేశం, ఫిబ్రవరి 1 -- పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‍ కేసును ఎదుర్కొంటున్నారు. ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో ఓ రోజు జైలులో ఉన్న అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‍పై బయటికి వచ్చారు. ఇటీవలే రెగ్యులర్ బెయిల్ రాగా.. చికిత్స పొందుతున్న శ్రీతేజ్‍ను కూడా అల్లు అర్జున్ పరామర్శించారు. అయితే, ఈ తొక్కిసలాట తర్వాత ఏ ఈవెంట్‍లోనూ అల్లు అర్జున్ పాల్గొనలేదు. అయితే, ఇప్పుడు ఆ ఘటన అనంతరం తొలిసారి మూవీ ఈవెంట్‍కు వస్తున్నారు బన్నీ. తండేల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా రానున్నారు.

తంజేల్ జాతర పేరుతో ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (ఫిబ్రవరి 1) హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో జరగనుంది. తండేల్ రాజు కోసం పుష్ప రాజ్ వస్తున్నాడంటూ అల్లు అర్జున్ చీఫ్ గె...