Hyderabad, ఏప్రిల్ 8 -- Akhil Akkineni Lenin: టాలీవుడ్ స్టార్ హీరో అఖిల్ అక్కినేని కెరీర్లో పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రెండేళ్ల కిందట ఏజెంట్ మూవీతో బొక్కబోర్లా పడిన అతడు.. ఇప్పుడు లెనిన్ (Lenin)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తాజాగా మంగళవారం (ఏప్రిల్ 8) ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

అఖిల్ అక్కినేని నటిస్తున్న సినిమాకు లెనిన్ అనే టైటిల్ పెట్టారు. మురళీ కిశోర్ అబ్బూరు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ ద్వారా అతడు పాపులర్ అయ్యాడు.

అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో కూడా అదిరిపోయేలా ఉంది. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మరో లెవెల్ అని చెప్పొచ్చు. అఖిల్ పూర్తిగా రగ్గ్‌డ్ లుక్ లో గుర్తుపట్టలేని విధంగా ఉన్నాడు. మ...