తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 15 -- కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించగా... ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఇప్పటివరకు పని చేసిన దీపాదాస్ మున్షీ స్థానంలో.... కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది.
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత NSUIలోకి ఎంట్రీ చేశారు. 1999-2002 వరకు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతేకాకుండా 2002-2005 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు.
2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చి నాయకురాలిగా మీనాక్షి నటరాజన్ కు పేరుంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.