తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 15 -- కాంగ్రెస్ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించగా... ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఇప్పటివరకు పని చేసిన దీపాదాస్ మున్షీ స్థానంలో.... కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ అధినాయకత్వం ఆదేశాలను జారీ చేసింది.

మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జన్మించారు. విద్యాభ్యాసం తర్వాత NSUIలోకి ఎంట్రీ చేశారు. 1999-2002 వరకు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అంతేకాకుండా 2002-2005 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా ఎంపికయ్యారు.

2009లో మధ్యప్రదేశ్‌ మాండసోర్‌ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్‌ పనిచేశారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చి నాయకురాలిగా మీనాక్షి నటరాజన్ కు పేరుంది...