భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఆహా ఓటీటీ దూకుడుగా సినిమాలకు తీసుకొస్తోంది. వరుసగా కొత్త కంటెంట్ తీసుకొస్తోంది. గత నెల జనవరిలో ఆహా ఓటీటీలో ఎనిమిది ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‍‍కు వచ్చాయి. వివిధ జానర్లలో ఈ సినిమాలు ఉన్నాయి. ఇందులో మూడు చిత్రాలు నేరుగా ఆహాలోనే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. జనవరిలో ఆహాలోకి అడుగుపెట్టిన 8 సినిమాలు ఏవంటే..

రజాకార్ చిత్రం జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గతేడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు 10 నెలల తర్వాత ఆహాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హిస్టారికల్ యాక్ష్ మూవీలో బాబీ సింహా, రాజ్ అర్జున్, అనసూయ, మార్కండ్ దేశ్‍పాండే కీలకపాత్ర పోషించగా.. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు.

రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ 'లవ్ రెడ్డి' జనవరి 3వ తేదీన ఆహా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అంజన్ రా...