భారతదేశం, ఫిబ్రవరి 17 -- మ‌రో ఇంట్రెస్టింగ్ వెబ్‌సిరీస్ త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతుంది. హౌమ్‌టౌన్ పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న‌ ఈ వెబ్‌సిరీస్‌లో సీనియ‌ర్ యాక్ట‌ర్లు రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సీ తో పాటు ప్ర‌జ్వ‌ల్ యాద్మా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం అనుబంధాలు అప్యాయ‌త‌ల‌కు ప్రాముఖ్య‌త‌నిస్తూ హోమ్‌టౌన్ వెబ్‌సిరీస్ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. హౌమ్‌టౌన్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్‌చేస్తామ‌ని ఆహా ఓటీటీ ప్ర‌క‌టించింది. మార్చి నెలాఖ‌రున లేదా ఏప్రిల్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజీవ్ క‌న‌కాల‌, ఝాన్సీతో పాటు ప్ర‌జ్వ‌ల్ యాద్మా కాంబినేష‌...