Hyderabad, జనవరి 31 -- Jiiva Arjun Sarja Rashi Khanna Aghathiyaa Postponed: తమిళంలో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకన్నారు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, జీవా. వీరిద్దరు కలిసి నటించిన సినిమా అఘాతియా. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా. విజయ్‌ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు.

గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి ఫాంటసీ హారర్ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా విడుదలైన సెకెండ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. 'నేలమ్మ తల్లి' అంటూ సాగే ఈ పాట అర్జున్‌ క్యారెక్టర్‌ను హైలెట్‌ చేసింది.

జీవా నటించిన గత చిత్రం బ్లాక్‌ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు...