భారతదేశం, ఏప్రిల్ 10 -- మ‌ల‌యాళం అడ్వెంచ‌ర్ హార‌ర్ మూవీ బియాండ్ ది సెవ‌న్ సీస్ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. 99 రూపాయ‌ల రెంట్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడొచ్చు. కేవ‌లం మ‌ల‌యాళ వెర్ష‌న్ మాత్ర‌మే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో ఈ మూవీ చూడొచ్చు.

బియాండ్ ది సెవ‌న్ సీస్ మూవీకి ప్ర‌తీష్ ఉత్త‌మ‌న్‌, స్మిటీ టైట‌స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీలో అథిరా ప‌టేల్‌, ప్ర‌శాంతి నాయ‌ర్‌, గౌరి గోప‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. 2022లో ఈ మ‌ల‌యాళం మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. విజువ‌ల్స్ బాగున్నా తాము అనుకున్న పాయింట్‌ను తెర‌పై ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డంలో ద‌ర్శ‌క‌ద్వ‌యం త‌డ‌బ‌డిపోయారు. థియేట‌ర్ల‌లో బియాండ్ ది సెవ‌న్ సీన్ డిజాస్ట‌ర్‌గా నిలిచ...