భారతదేశం, మార్చి 26 -- పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ మూవీ దేవా థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రాబోతోంది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ హిందీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం.

దేవా మూవీలో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టించాడు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన ముంబై పోలీస్ మూవీకి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు రోష‌న్ ఆండ్రూస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల న‌డుమ థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

షాహిద్ క‌పూర్ యాక్టింగ్ బాగుందనే కామెంట్స్ వ‌చ్చినా క్లైమాక్స్‌తో పాటు స్క్రీన్‌ప్లే విష‌యంలో దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. దాదాపు 80 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ 60 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్‌, విశాల్ మిశ్రా మ్...