భారతదేశం, మార్చి 2 -- తెలుగు బ‌యోపిక్ మూవీ జితేంద‌ర్ రెడ్డి ఓటీటీలోకి వ‌స్తోంది. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ సినిమామార్చి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రాకేష్ వ‌ర్రే, రియాసుమ‌న్ హీరోహీరోయిన్లు న‌టించారు. విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

జ‌గిత్యాల‌కు చెందిన ఆర్ఎస్ఎస్ లీడ‌ర్ జితేంద‌ర్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్ట‌ర్ విరించి వ‌ర్మ ఈ సినిమాను రూపొందించాడు. జితేంద‌ర్‌రెడ్డిని న‌క్స‌లైట్లు ఎందుకు చంపారు? 1980-90 ద‌శ‌కంలో తెలంగాణ లో నెల‌కొన్న సామాజిక అస‌మాన‌త‌ల‌పై అత‌డు ఎలాంటి పోరాటం చేశాడు అనే అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. జితేంద‌ర్ రెడ్డి మూవీలో ఆనాటి రాజ‌కీయ అంశాల‌ను ట‌చ్ చేయ‌డ‌మే కాకుండా ఎన్టీఆర్‌, వాజ్‌పేయి లాంటి నాయ‌కులు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను ప్ర‌స్తావించారు.

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో...