భారతదేశం, ఫిబ్రవరి 14 -- Acid Attack: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణ ఘటన జరిగింది. వివాహం నిశ్చయమైన యువతిపై కత్తితో దాడి చేసి ఆమె ముఖంపై యాసిడ్ పోసిన ఘటన వెలుగు చూసింది.

గాయాలపాలైన బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన నిందితుడిని మదనపల్లెలోని అమ్మచెరువు మిట్టకు చెందిన గణేశ్ గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల పరిధిలోని పేరం పల్లె గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 29న సదరు యువతికి తల్లిద్రండులు పెళ్లి నిశ్చయం చేశారు.

యువతికి పెళ్లి నిశ్చయించిన విషయం తెలిసిన గణేష్ యువతిపై కోపం పెంచుకున్నాడ...