భారతదేశం, ఫిబ్రవరి 10 -- లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ప్రక్రియ ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. తాజాగా ఈ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ 8cpc.gov.in ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వం నేరుగా స్టేక్‌హోల్డర్లు, ఉద్యోగుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది.

నవంబర్ 3, 2025న ఆర్థిక శాఖ ఈ 8వ వేతన సంఘాన్ని అధికారికంగా నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగా సాధారణ ఉద్యోగులు సైతం జీతాలు, పెన్షన్లపై తమ అభిప్రాయాలను వినిపించేందుకు అవకాశం లభించడం విశేషం.

ఈ సర్వేను కేంద్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంచింది. కింది జాబితాలో ఉన్నవారు తమ అభిప్రాయాలను సమర్పించవచ్చు:

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాల (యూటీ) సిబ్బంది.

పెన్షనర్లు, రిటైర్డ్ ఉద...