భారతదేశం, మార్చి 7 -- డీఏ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఇప్పుడు 8వ పే కమిషన్​పై పడింది. ఉద్యోగుల జీతాలు, పింఛనుదారుల పెన్షన్లను రివ్యూ చేసేందుకు 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు 2025 జనవరిలో కేంద్రం ప్రకటించింది. ఈ కమిటీ.. తన సిఫార్సులను వచ్చే ఏడాది తొలినాళ్లల్లో ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. వీటి మధ్య కొన్ని నివేదికలపు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న అలొవెన్స్​లలో కొన్ని తగ్గే అవకాశం ఉందని ఆ నివేదికలు చెబుతున్నాయి.

8వ పే కమిషన్​ చైర్మన్​తో పాటు ఇద్దరు సభ్యుల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే నెలలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభ్యులు ఉద్యోగుల వేతనాలు, అలొవెన్స్​లు, పెన్షన్లపై నివేదికలు రూపొందిస్తారు.

8వ వేతన సంఘం ప్రకటన వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల జీతల సవరణ, పెన్షన్​పై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయ...