భారతదేశం, సెప్టెంబర్ 2 -- రియల్‌మీ భారత్‌లో కొత్త మిడ్-రేంజ్ ఫోన్ రియల్​మీ 15టీని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 7000ఎంఏహెచ్​ బ్యాటరీ, అమోలెడ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చింది. ఇది మార్కెట్​లో వన్​ప్లస్​ నార్డ్​ సీఈ5, ఐక్యూ నియో 10ఆర్​, ఇన్ఫీనిక్స్​ జీటీ 30 ప్రో వంటి ఫోన్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేద్దాము..

రియల్‌మీ 15టీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్​ఫోన్ నేటి నుంచే ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 6 నుంచి రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.

లాంచ్ ఆఫర్లలో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 4,000 ఎక్స్​ఛేంజ్ ఆఫర్ (12GB వేరియ...