భారతదేశం, ఫిబ్రవరి 16 -- బాలీవుడ్ వెండితెరపై దశాబ్దాలుగా తనదైన ముద్ర వేస్తూ, వయసు పెరుగుతున్నా తరగని ఉత్సాహంతో దూసుకుపోతున్న ఎవర్ గ్రీన్ హీరో అనిల్ కపూర్. ప్రస్తుతం ఆయన వయసు 69 ఏళ్లు. ఈ వయసులోనూ యువ హీరోలకు పోటీనిచ్చేలా ఆయన ప్రదర్శించే ఎనర్జీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు.

ఇంటర్వ్యూలలో కానీ, బహిరంగ వేదికలపై కానీ అనిల్ కపూర్ కనిపించారంటే అక్కడ సందడి వేరేలా ఉంటుంది. అయితే, తనలోని ఈ నిరంతర శక్తికి కారణం ఏంటో అనిల్ కపూర్ తాజాగా రివీల్ చేశారు.

ఇటీవల 'స్క్రీన్' మ్యాగజైన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ కపూర్‌ను మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటని ప్రశ్నించగా.. ఆయన ఎంతో నిజాయతీగా సమాధానమిచ్చారు.

"నాలోని ఈ ఎనర్జీకి నా 'అభద్రతా భావం' (Insecurity) కూడా ఒక కారణమని నేను భావిస్తాను. నాకు ఎప్పుడూ పని చేయాలనే తపన ఉంటుంది. నేను ఫిట్‌గా ఉంటూ, ఉత్సాహ...