భారతదేశం, జూలై 13 -- వివో కంపెనీ జులై 14, సోమవారం భారతదేశంలో ఎక్స్ ఫోల్డ్ 5, ఎక్స్200 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్​ చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త ఫోల్డెబుల్ ఫోన్ శాంసంగ్, మోటరోలా గ్యాడ్జెట్స్​కి నేరుగా పోటీ ఇవ్వనుండగా, ఎక్స్200 ఎఫ్‌ఈ మోడల్ ఇటీవల విడుదలైన వన్‌ప్లస్ 13ఎస్​కు గట్టి పోటీనిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ డివైజ్​లపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..

వివో ఎక్స్200 ఎఫ్‌ఈ స్మార్ట్​ఫోన్​ 6.31-ఇంచ్​ డిస్‌ప్లేతో రానున్నట్లు కన్ఫర్మ్​ అయ్యింది. ఇది 8 ఎంఎం కంటే తక్కువ మందంతో ఉండనుంది. ఈ ఫోన్‌లో రెండు 50ఎంపీ జైస్ బ్రాండెడ్ లెన్స్‌లు, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉంటాయని కూడా ఖరారు చేశారు. అయితే, ఈ లెన్స్‌ల కోసం వివో ఏ సెన్సార్‌ను ఉపయోగిస్తుందనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.

చిన్న డిజైన్ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ పెద్ద బ్యాటరీ ట్రెండ...