భారతదేశం, సెప్టెంబర్ 29 -- భారతదేశంలో వివో సంస్థ త్వరలోనే తన కొత్త వీ సిరీస్ మోడల్ అయిన వివో వీ60ఈ 5జీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేయబోతోంది. ఈ కొత్త మోడల్‌ను ఇతర వీ-సిరీస్ ఫోన్ల కంటే తక్కువ ధరకు, మరింత సరసమైన ధరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. టెక్ నిపుణులు దీని కీలక ఫీచర్లు, వివరాలను ముందుగానే లీక్ చేస్తున్నారు. అంతేకాకుండా.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా పొరపాటున వివో వీ60ఈ 5జీ ధర, స్టోరేజ్ వేరియంట్లను వెల్లడించిందని రూమర్స్​ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మిడ్‌రేంజ్ ఫోన్ ఏమేమి అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ఎక్స్​ (గతంలో ట్విట్టర్) లో ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ స్క్రీన్‌షాట్‌లను పంచుకున్నారు. వాటి ప్రకారం వివో వీ60ఈ 5జీ మూడు స్టోరేజ్ మోడళ్లలో అందుబ...