భారతదేశం, ఆగస్టు 31 -- ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ ఫోన్‌ను బంపర్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ 3 వరకు జరిగే ఈ బంపర్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ లాంచ్ ధర కంటే చౌకగా లభిస్తోంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.33,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

ఈ ఫోన్‌పై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఈ డివైజ్ రూ.15,950 వరకు చౌకగా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే అదనపు డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లో 2340x1080 పిక్సెల్ రిజల్యూషన్ తో 6.6 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డి...