భారతదేశం, జూలై 1 -- వెల్​క్యూర్​ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ (Welcure Drugs and Pharmaceuticals) షేరు ధర మంగళవారం ట్రేడింగ్ సెషన్‌లో 5 శాతం పెరిగి రూ. 14.28 వద్ద అప్పర్ సర్క్యూట్​ని తాకింది. సుమారు రూ. 85.6 కోట్ల (ఒక్కోటి Rs.42.8 కోట్లు) విలువైన రెండు ఎక్స్​పోర్ట్​ సోర్సింగ్ ఆర్డర్‌లను పొందినట్లు కంపెనీ ప్రకటించడంతో స్టాక్​ ఇంతలా పెరిగింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో రూ. 14.28 వద్ద ఉన్న వెల్​క్యూర్​ డ్రగ్స్​ అండ్​ ఫార్మా షేరు.. ఐదు రోజుల్లో 0.07శాతం పడింది. కానీ నెల రోజుల్లో 26.7శాతం పెరిగింది. ఈ స్మాల్​ క్యాప్​ స్టాక్​ ఆరు నెలల్లో 28.7శాతం, ఏడాదిలో 184.46శాతం వృద్ధి చెందింది. కాగా ఐదేళ్లల్లో ఈ స్టాక్​ ఏకంగా 1969.5శాతం వృద్ధి చెందింది. రూ. 0.69 నుంచి రూ. 14.28కి పెరిగింది.

వివిధ రకాల ఫార్మాస్యూటికల్ ప్రాడక్ట్స్​ ఉత్పత్తి, మార్కెటిం...