భారతదేశం, జూలై 14 -- భారత్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో 350 సీసీ సెగ్మెంట్​ బైక్స్​కి సూపర్​ డిమాండ్​ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా యువత ఇలాంటి బైక్స్​ని ఇష్టపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆటోమొబైల్​ సంస్థలు స్టైలిష్​ డిజైన్​తో పవర్​ఫుల్​ బైక్స్​ని తీసుకొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సెగ్మెంట్​లో రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350, హోండా సీబీ350లకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. మరి మీరు కొత్తగా ఒక బైక్​ తీసుకోవాలని చూస్తుంటే, ఈ రెండింటిలో ఏది బెస్ట్​? వీటి ధరలు, స్పెసిఫికేషన్స్​ని పోల్చి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్​ ధర రూ. 1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, వేరియంట్‌ను బట్టి రూ. 1.82 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మరోవైపు, హోండా సీబీ350 రెండు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.2 లక్షల (ఎక్స్...