భారతదేశం, డిసెంబర్ 2 -- తమ అత్యంత ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్‌ని ఆవిష్కరించింది శాంసంగ్. ఇది కంపెనీ రూపొందించిన 2 హింజ్​, 3 ఇంటర్​-కనెక్టెడ్​ డిస్​ప్లేలు కలిగిన మొట్టమొదటి పరికరం! ఈ లాంచ్‌తో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్స్​ సెగ్మెంట్​లో ఒక ముఖ్యమైన ముందడుగు పడింది. ఈ డివైస్ మడిచినప్పుడు జేబులో పెట్టుకోగలిగే ఫోన్‌గా ఉంటూనే, ఓపెన్​ చేసినట్టు ట్యాబ్లెట్-సైజు ఎక్స్​పీరియెన్స్​ని ఇస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్​ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

గెలాక్సీ జెడ్​ ట్రైఫోల్డ్ ఓపెన్​ చేసినప్పుడు 10 ఇంచ్​ వైడ్‌స్క్రీన్ లేఅవుట్‌గా మారుతుంది! ఇది పని, వినోదం, మల్టీటాస్కింగ్ కోసం ట్యాబ్లెట్ లాంటి కాన్వాస్‌ను అందిస్తుంది.

మడిచినప్పుడు, రోజువారీ ఉపయోగం కోసం బయటి వైపున 6.5 ఇంచ్​ కవర్ స్క్రీన్​పై...