భారతదేశం, జనవరి 9 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్​లో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కంపెనీలు తమ బేస్ వేరియంట్లలోనే ఇప్పుడు విలాసవంతమైన ఫీచర్లను అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్, మహీంద్రా ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ బేస్ వేరియంట్లు ఇందుకు నిదర్శనం. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ మూడింటిలో ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

టాటా సియెర్రా ఎస్​యూవీ గత నవంబర్​లో లాంచ్​ అయ్యింది. దీని బేస్​ వేరియంట్​ పేరు స్మార్ట్​+. ఈ వేరియంట్​ పెట్రోల్ మాన్యువల్ రూ. 11.49 లక్షల నుంచి ప్రారంభం. ఈ వేరియంట్​ ఫీచర్లు..

ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

స్టోరేజ్‌తో కూడిన ఫ్రంట్ స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్

ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్

లైట్ సేబర్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, టెయ...