భారతదేశం, ఆగస్టు 5 -- 2025 జనవరి నుంచి జులై వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా హ్యుందాయ్ క్రెటా రికార్డు సృష్టించింది! ఈ ఏడు నెలల కాలంలో క్రెటాకు సంబంధించి ఏకంగా 1,17,458 యూనిట్లను విక్రయించినట్లు హ్యుందాయ్ సంస్థ ప్రకటించింది. ఫలితంగా కేవలం మిడ్-ఎస్యూవీ సెగ్మెంట్లోని ప్రత్యర్థులను మాత్రమే కాకుండా.. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లను కూడా అధిగమించి మొత్తం కార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది క్రెటా.
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో విపరీతంగా పోటీ పెరిగింది. కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి అధునాతన ఫీచర్లతో కూడిన ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయినప్పటికీ, హ్యుందాయ్ క్రెటా తన అగ్రస్థానాన్ని ఎప్పుడూ కోల్పోలేదు! జూన్ 2025లో, క్రెటా 15,786 యూనిట్లను విక్రయించి.. ఆ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.