భారతదేశం, ఆగస్టు 5 -- 2025 జనవరి నుంచి జులై వరకు దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా హ్యుందాయ్ క్రెటా రికార్డు సృష్టించింది! ఈ ఏడు నెలల కాలంలో క్రెటాకు సంబంధించి ఏకంగా 1,17,458 యూనిట్లను విక్రయించినట్లు హ్యుందాయ్ సంస్థ ప్రకటించింది. ఫలితంగా కేవలం మిడ్-ఎస్‌యూవీ సెగ్మెంట్లోని ప్రత్యర్థులను మాత్రమే కాకుండా.. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లను కూడా అధిగమించి మొత్తం కార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచింది క్రెటా.

గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్​లో విపరీతంగా పోటీ పెరిగింది. కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్ వంటి అధునాతన ఫీచర్లతో కూడిన ఎన్నో కార్లు మార్కెట్​లోకి వచ్చాయి. అయినప్పటికీ, హ్యుందాయ్ క్రెటా తన అగ్రస్థానాన్ని ఎప్పుడూ కోల్పోలేదు! జూన్ 2025లో, క్రెటా 15,786 యూనిట్లను విక్రయించి.. ఆ న...