భారతదేశం, జూన్ 30 -- స్టీల్‌బర్డ్ హెల్మెట్స్ కొత్తగా టోర్నాడో హెల్మెట్ సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఈ హెల్మెట్‌లను భారతీయ (ISI), అంతర్జాతీయ (DOT) ప్రమాణాలు రెండింటికీ అనుగుణంగా తయారు చేయడం జరిగింి. సాధారణ కమ్యూటర్ హెల్మెట్‌ల విభాగంలోకి వచ్చే ఈ టోర్నాడో హెల్మెట్ ధర రూ. 1,959 మాత్రమే! ఈ నేపథ్యంలో ఈ హెల్మెట్స్​ గురించి ఇక్కడ తెలుసుకోందాము..

వివిధ సైజుల్లో లభ్యత: టోర్నాడో హెల్మెట్ నాలుగు విభిన్న సైజుల్లో అందుబాటులో ఉంది. అవి.. ఎస్​ (560ఎంఎం), ఎం (580ఎంఎం), ఎల్​​ (600ఎంఎం), ఎక్స్​ఎల్​ (620ఎంఎం). ఇది వివిధ రకాల వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా రూపొందించడం జరిగింది.

మైక్రో-మెట్రిక్ బకిల్: ఈ హెల్మెట్‌లో యూరోపియన్ ఫాస్టెనింగ్ ప్రమాణాలకు కట్టుబడి ఉండే మైక్రో-మెట్రిక్ బకిల్ ఉపయోగించడం జరిగింది. ఇది ఇప్పుడు మిడ్​ లెవల్​ హెల్మెట్‌లలో సాధార...