భారతదేశం, జూలై 15 -- ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు వరుసగా రెండో సెషన్​లో కూడా లాభాల బాటలో పయనించాయి. మొత్తం మీద రెండు రోజుల్లో ఈ స్టాక్​ 22శాతం వృద్ధిచెందింది. ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 428 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించినప్పటికీ, ఈ జోరు కొనసాగడం స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచింది. మరి ఈ స్టాక్​ పెరగడానికి కారణం ఏంటి? స్టాక్​ని ఇప్పుడు కొనొచ్చా? ఓలా ఎలక్ట్రిక్​ షేర్​ ప్రైజ్​ టార్గెట్​ ఎంత? నిపుణులు ఏమంటున్నారంటే..

గత త్రైమాసికంతో పోలిస్తే నష్టాలు ఓలా ఎలక్ట్రిక్​ తగ్గడం పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని నింపింది. దీనితో పాటు ఆటో విభాగంలో మార్జిన్ల మెరుగుదల, జూన్‌లో ఎబిట్​డా సానుకూలంగా మారడం వంటి అనేక ఆపరేటింగ్ పనితీరు అప్‌డేట్‌లు ఈ ద్విచక్ర విద్యుత్ కంపెనీ స్టాక్‌పై ఆసక్త...