భారతదేశం, మే 21 -- కర్ణాటకకు చెందిన 77 ఏళ్ల రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త బాను ముష్తాక్ చరిత్ర సృష్టించారు. తన అనువాదకురాలు దీపా భాస్తితో కలిసి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఈ ప్రసిద్ధిగాంచిన అవార్డును గెలిచిన మొదటి కన్నడ రచయిత్రిగా ఆమె నిలిచారు. 'హార్ట్ ల్యాంప్' అనే కథల సంకలనానికి బుకర్ ప్రైజ్ గెలుచుకున్నారు. బాను ముష్తాక్ 1950ల్లో హాసన్ పట్టణంలోని పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే తన మొదటి కథ రాశారు.
'హార్ట్ ల్యాంప్' అనేది 12 చిన్న కథల పుస్తకం. ఈ కథల్ని ఆమె 30 ఏళ్లలో రాశారు. కర్ణాటకలోని ముస్లిం మహిళల రోజువారీ జీవితాల్ని చిత్రించారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పడ్డ ఐదు పుస్తకాలను ఇది వెనక్కి నెట్టి విజయం సాధించింది. ఇంగ్లీషులోకి అనువాదం చేసిన ఉత్తమ కల్పన పుస్తకానికి ఇచ్చే ఈ వార్షిక ప్రైజ్‌ను గెలిచిన మొదటి చిన్న కథల సంకలనం ఇది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.