భారతదేశం, డిసెంబర్ 28 -- వందే భారత్ ట్రైన్ సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఇటీవలనే ఏపీలోని నర్సాపురం వరకు ట్రైన్ సేవలను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ మరో శుభవార్తను అందించింది.కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ఇక నుంచి హిందూపూర్‌లో కూడా ఆగనుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.
కాచిగూడ-యశ్వంత్‌పూర్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 గంటలకు హిందూపూర్ చేరుకుని 12.10 గంటలకు బయల్దేరనుంది. అంటే 2 నిమిషాలపాటు ఈ స్టేషన్ లో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్లో రైలు నెంబర్ 20704(యశ్వంత్‌పూర్-కాచిగూడ) మధ్యాహ్నం 3.48 నుంచి 3.50 గంటల వరకు ఆగుతుంది. ఈ హాల్టింగ్ సౌకర్యంతో.. హిందూపూర్ ప్రాంతంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించటమే లక్ష్యమని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.