భారతదేశం, డిసెంబర్ 28 -- వందే భారత్ ట్రైన్ సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఇటీవలనే ఏపీలోని నర్సాపురం వరకు ట్రైన్ సేవలను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ మరో శుభవార్తను అందించింది.కాచిగూడ-యశ్వంత్‌పూర్ మధ్య నడిచే వందేభారత్ ట్రైన్ ఇక నుంచి హిందూపూర్‌లో కూడా ఆగనుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

కాచిగూడ-యశ్వంత్‌పూర్ (ట్రైన్ నెంబర్ 20703) మధ్యాహ్నం 12.08 గంటలకు హిందూపూర్ చేరుకుని 12.10 గంటలకు బయల్దేరనుంది. అంటే 2 నిమిషాలపాటు ఈ స్టేషన్ లో ఆగనుంది. తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్‌లో రైలు నెంబర్ 20704(యశ్వంత్‌పూర్-కాచిగూడ) మధ్యాహ్నం 3.48 నుంచి 3.50 గంటల వరకు ఆగుతుంది. ఈ హాల్టింగ్ సౌకర్యంతో.. హిందూపూర్ ప్రాంతంలోని ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించటమే లక్ష్యమని రైల్వేశాఖ అధికారులు చెబుతున్నా...