భారతదేశం, ఏప్రిల్ 27 -- నవీ ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్​ చేసేటప్పుడు గొడవ జరగడంతో ఒక 12ఏళ్ల బాలికను ఓ 17ఏళ్ల బాలుడు చంపేశాడు! రాయితో తల మీద కొట్టి కొట్టి హత్య చేశాడు.

నవీ ముంబైలోని శిరావనే ఎంఐడీసీ అనే ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. 12ఏళ్ల బాలికకు 17ఏళ్ల బాలుడితో ముందే పరిచయం ఉంది. అతను, ఆ బాలిక ఇంటికి సమీపంలోనే నివాసముంటున్నాడు. వీరిద్దరు ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేసేవారు.

గురువారం, ఎప్పటిలానే వీరిద్దరు కలిసి రీల్స్​ చేయడం మొదలుపెట్టారు. శిరావనే ఎంఐడీసీలోని అటవీ ప్రాంతంలో రీల్స్​ చేస్తుండగా గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్తా తీవ్రమైంది. కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు.. బాలికపై దాడి చేశాడు. పక్కనే ఉన్న రాయి తీసుకుని ఆమె తల మీద పలుమార్లు బలంగా కొట్టాడు. ఆ బాలిక కిందపడిపోయింది. ఆమె ఫోన్​ తీసుకుని, అతను అక్కడి నుంచి పారిపోయాడు.

బాలిక ఇంట...