భారతదేశం, నవంబర్ 1 -- పుణెలో ఆన్‌లైన్ ప్రకటనకు స్పందించిన ఒక వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. "నన్ను గర్భవతి చేసేందుకు ఒక మగాడి కోసం వెతుకుతున్నాను" అనే ఆన్‌లైన్ ప్రకటనను చూసిన ఆ వ్యక్తి, అది మోసమని గ్రహించేలోపే భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు!

ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఆ ప్రకటనకు స్పందించిన వెంటనే మోసగాళ్లు ఆ వ్యక్తిని నమ్మించారు. అతడిని ఇనీషియల్​ ఫీజు, మెంబర్​షిప్​ ఫీజు, ప్రైవసీ ఫీజు వంటి వివిధ రకాల పేర్లతో డబ్బులు చెల్లించమని అడిగారు. ఈ చెల్లింపులు చేయకపోతే తమ 'పని' పూర్తి కాదని మోసగాళ్లు చెప్పడంతో, ఆ వ్యక్తి వారి ఉచ్చులో పడిపోయి అనేక ఆన్‌లైన్ బదిలీలు చేశాడు.

పలు దఫాలుగా డబ్బులు బదిలీ చేసిన తర్వాత, ఆ ప్రకటన వెనుక ఉన్న వ్యక్తుల నుంచి సదరు వ్యక్తికి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో తాను మ...