భారతదేశం, జూలై 11 -- రణబీర్ కపూర్ నటిస్తున్న 'రామాయణం' సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో రణబీర్ శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపించనున్నాడు. ఈ రెండు పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు 42 ఏళ్ల రణబీర్.. కఠినమైన, సంపూర్ణ శారీరక మార్పునకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా వివిధ రకాల శిక్షణలను మిళితం చేశాడు.

రణబీర్ కపూర్ ఫిట్‌నెస్ కోచ్‌లలో ఒకరైన నామ్-వూక్ కాంగ్, ఈ కఠోర శ్రమకు సంబంధించిన వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

రణబీర్ గాలిలో వేలాడుతూ కాలిస్థెనిక్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నేవీ బ్లూ షార్ట్స్, వైట్ స్నీకర్స్ ధరించి.. పర్ఫెక్ట్ పొజిషన్‌లో బార్‌ను ...