భారతదేశం, అక్టోబర్ 3 -- ఓ అమెరికా సంస్థ.. ఒక భారతీయ ఉద్యోగిని ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒక్క కాల్‌తో ఉద్యోగం నుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక అమెరికాకు చెందిన కంపెనీలో పనిచేస్తున్న ఆ ఉద్యోగి తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని రెడిట్ పోస్ట్‌లో పంచుకున్నారు. అంతేకాదు, తన సంస్థలోని చాలా మంది భారతీయులకు ఇదే తరహా పరిస్థితి ఎదురైందని వివరించారు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆ ఉద్యోగికి మద్దతు తెలుపుతూ, కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి సహాయం చేస్తున్నారు.

ఉద్యోగం కోల్పోయిన ఆ వ్యక్తి తాను అమెరికన్ కంపెనీకి వర్క్​ ఫ్రం హోమ్​ ద్వారా పనిచేస్తున్నట్లు వివరించారు.

"నాకు అది మామూలు రోజులాగే మొదలైంది. ఉదయం 8:30 గంటలకు నిద్ర లేచాను. 9 గంటలకు పనిలోకి లాగిన్ అయ్యాను. 11 గంటలకు నా క్యాలెండర్‌లో ఒక మాండెటరీ మీటింగ్ (తప్పనిసరి సమావేశం) ఆహ్వానం కనిపిం...