భారతదేశం, సెప్టెంబర్ 2 -- యావత్​ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఎయిరిండియా విమాన ప్రమాద ఘటన థీన్​తో రెండు చోట్ల మండపాలు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది! ఇలాంటి విషాదకర విషయాలను కూడా ఉపయోగించుకోవడం అమర్యాదకరం అని, అసహ్యకరం అని సోషల్​ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం థీమ్​తో నిర్మించిన రెండు గణేశ్​ మండపాల్లో ఒకటి నాగ్‌పూర్‌లో, మరొకటి అహ్మదాబాద్‌లో ఉన్నాయి.

నాగ్‌పూర్‌లోని జరిపట్కాలోని మండపంలో, అహ్మదాబాద్‌లోని ఓ హాస్టల్ భవనాన్ని ఢీకొన్న విమానాన్ని పోలినట్టుగా ఒక 3డీ నమూనాను ఏర్పాటు చేశారు. ఈ మండపం వీడియోలు ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అయ్యాయి.

అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ మండపం మరింత వివాదాస్పదంగా మారింది! ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని యథాతథంగా పునఃసృష్టించారు. కాలిపోయిన భవనాలు, సంఘటనాస్థలానికి చేరుకున్న ...