భారతదేశం, మే 25 -- ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం అవతరించింది! ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న జపాన్ 5వ స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం ప్రకటించారు. నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.
"భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మన ముందు అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి," అని సుబ్రమణ్యం అన్నారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) గణాంకాలను ఉటంకిస్తూ.. భారత్ ఇప్పుడు జపాన్ని అధిగమించిందని నీతి ఆయోగ్ సీఈఓ ధృవీకరించారు. అంతేకాదు 2.5-3 ఏళ్లలో ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు.
2010లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల లిస్ట్‌లో భారత్ 10వ స్థానంలో ఉండే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.